రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్​ చేయడంపై సాక్షి మలిక్‌ ఆగ్రహం

-

పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవం రోజునే రెజ్లర్ల ఆందోళనను పోలీసులు అణిచివేసిన సంగతి తెలిసిందే. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆందోళన సాగిస్తున్న రెజ్లర్లు.. ఆదివారం కొత్త పార్లమెంట్‌ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మహిళా రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్న తీరు యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు చోట్లకు తరలించారు. అయితే ఆ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేయడంతో అవి సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ మార్ఫింగ్‌ ఫొటోల్లో వినేశ్‌ ఫొగాట్‌, సంగీత ఫొగాట్‌ పోలీసు వ్యాన్‌లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నట్లుగా ఉంది.

దీనిపై స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్‌ స్పందించారు. ‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్‌ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news