టీడీపీ మేనిఫెస్టో అమలు చేస్తే..ఏపీ మరో శ్రీలంకనే అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చురకలు అంటించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు..టిడిపి మానిఫెస్టో లో 100 పేజిలు పెట్టారని ఫైర్ అయ్యారు. ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదని మండిపడ్డారు. వైసిపి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడితే రాష్ట్ర శ్రీలంక గా మారుతుంది అని చంద్రబాబు విమర్శించారని గుర్తు చేశారు.
పాత అబద్ధపు హామీలతో కొత్త అబద్ధపు హామీలు కలిపి టిడిపి మానిఫెస్టో విడుదల చేశారని.. వైసిపి కేవలం రెండు పేజీల మానిఫెస్టో తో వచ్చి 98.44 శాతం హామీలు నెరవేర్చారని వెల్లడించారు. టిడిపి కార్యకర్తలు మానిఫెస్టో తో ప్రజల్ని మభ్యపెట్టే పనిలో పడుతారన్నారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను పక్కన పెట్టేసి జగన్ మంచి పాలన అందిస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సిఎం వైఎస్ జగన్ గతంలోకంటే అధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు.