ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..స్పెషలిస్టు వైద్యులకు రూ.30 వేల ప్రత్యేక అలవెన్స్‌

-

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషలిస్టు వైద్యులకు రూ.30 వేల ప్రత్యేక అలవెన్స్‌ ఇచ్చేందుకు ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లకు ఇకపై ప్రత్యేకంగా నెలకు రూ. 30,000 అలవెన్స్ చెల్లించనుంది ఏపీ సర్కార్.

వైద్య విద్య సంచాలకుల కార్యాలయ పరిధిలో పనిచేసే సూపర్ స్పెషలిస్ట్ వైద్యులకు తాజా నిర్ణయం వర్తిస్తుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది ఇలా ఉండగా, ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. ఘటనా స్థలానికి మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం వెళ్లనుంది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేశారు. అవసరమైన పక్షంలో ఘటనాస్థలానికి పంపించడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం చేయనున్నారు సీఎం జగన్‌. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులు అలర్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news