అయోధ్య కేసులో నేడే తీర్పు.. అంతటా ఉత్కంఠ..?

-

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామజన్మభూమి కేసు విచారణ క్లైమాక్స్ కు చేరింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొన్నాళ్లుగా సాగుతోంది. వివిధ వర్గాల వాదనలు సుప్రీం కోర్టు విన్నది. ఈ రోజు సుప్రీంకోర్టులో 40వ రోజు విచారణ జరుగుతోంది. నేటితో అయోధ్య భూ వివాద కేసు విచారణ ముగిసిపోనుంది.

ఈరోజు వాదనలు ముగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ తన వాదనలు వినిపిస్తున్నారు. ఎదుటి పక్షాల వాదనలపై తుది వాదనలకు 45 నిమిషాల చొప్పున 5 కక్షిదారులకు సమయం కేటాయించారు.

ఈరోజు వాదనలు ముగిసిన తర్వాత తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. అంటే తీర్పు తర్వాత ప్రకటిస్తారు. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లా మధ్య సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.

అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది. ఈరోజుతో వాదనలు ముగిస్తే సుప్రీంకోర్టు చరిత్రలో సుదీర్ఘ విచారణ జరిగిన రెండు కేసుగా అయోధ్య భూవివాదం కేసు రికార్డు సృష్టించనుంది. గతంలో సుప్రీం కోర్టు కేశవనంద భారతి కేసు విషయంలో 68 రోజుల పాటు విచారణ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news