తెలంగాణలో ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష

-

తెలంగాణ గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష ఎట్టకేలకు ఇవాళ జరగనుంది. గతేడాది అక్టోబరు 16న జరిగిన పరీక్ష.. క్వశ్చన్ పేపర్ లీకేజీ కారణంగా రద్దు కావడంతో  మళ్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లోని 994 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఈసారి టీఎస్‌పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు శాశ్వతంగా డిబార్‌ చేస్తామని హెచ్చరించింది. సమాధాన పత్రంపై బబ్లింగ్‌లో పొరపాట్లు చేయవద్దని కమిషన్‌ సూచించింది.

వివిధ శాఖల్లోని 503 గ్రూపు-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ జారీ అయింది. అప్పట్లో 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం బహిర్గతం కావడంతో ప్రిలిమినరీ పరీక్షను అధికారులు రద్దు చేశారు. జూన్‌ 11న తిరిగి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించిన కమిషన్‌ ఆమేరకు ఏర్పాట్లు చేసింది. మొదటి దఫాలో దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news