బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా..? ఇలా చేస్తే బియ్యానికి పురుగులు పట్టవు..!

-

మనం ఇంట్లో ప్రతి వస్తువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పాడైపోతే తిరిగి మనం ఆ వస్తువుని పొందలేము. ప్రతి ఒక్కరూ రోజు అన్నం తింటూ ఉంటారు అయితే రోజు అన్నం తింటాము కాబట్టి ఎక్కువ మోతాదులో మనం బియ్యాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాము అయితే బియ్యాన్ని ఎక్కువగా తెచ్చుకుని ఇంట్లో పెట్టడం వలన సమస్య ఉండదు కానీ బియ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి బియ్యానికి పురుగులు పట్టొచ్చు ఎక్కువ మోతాదులో బియ్యాన్ని ఇంటికి తెచ్చుకొని వాటిని పాడు చేసుకుంటే డబ్బులు వృధా తప్ప ఫలితం ఉండదు పైగా ఒకసారి పురుగులు పట్టాయి అంటే వాటిని వేరు చేయడం కష్టంగా ఉంటుంది.

బియ్యానికి పురుగులు
బియ్యానికి పురుగులు

పురుగుల వలన రకరకాల సమస్యలు కూడా కలగొచ్చు అయితే ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కాలని ట్రై చేయండి… ఇలా చేస్తే బియ్యానికి పురుగులు పట్టవు. బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇంగువని మూట కట్టి బియ్యం డబ్బాలో పెడితే ఆ ఘాటుకి పురుగులు చేరకుండా ఉంటాయి అలానే పురుగులు పట్టకుండా ఉండాలంటే కర్పూరాన్ని కూడా ఇదే విధంగా మూటకట్టి పెట్టండి అప్పుడు పురుగులు పట్టవు.

వేపాకు కూడా బియ్యానికి పురుగులు చేరకుండా చూసుకుంటుంది. బియ్యాన్ని నిలువ చేసుకునే డబ్బా లో వేపాకులను వేస్తే బియ్యానికి పురుగులు పట్టవు. వేపాకు పొడిని కూడా మీరు ఉపయోగించవచ్చు. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి బియ్యంలో ఉంచితే కూడా బియ్యానికి పురుగులు పట్టవు. లవంగాలను కూడా మీరు వెయ్యొచ్చు. లవంగాలు పొడి చేసి ఒక చిన్న క్లాత్లో కట్టి బియ్యం డబ్బాలో పెడితే పురుగులు పట్టవు. ఒక చిన్న క్లాత్ లో కొంచెం ఉప్పును వేసి మూటకట్టి బియ్యం లో ఉంచితే కూడా పురుగులు పట్టకుండా ఉంటాయి. కాకరకాయల ముక్కల్ని ఎండబెట్టి వాటిని పొడి చేసి మూటకట్టి బియ్యం డబ్బాలో పెడితే పురుగులు పట్టవు.

Read more RELATED
Recommended to you

Latest news