గత రెండు రోజులుగా బీజేపీపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. తనకు బిజెపి అండ ఉండకపోవచ్చు అనే కామెంట్ కి అర్థం ఏంటో చెప్పాలని సీఎం జగన్ ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అంటే మీతో బిజెపి ఎప్పుడు ఉందో చెప్పాలని నిలదీశారు. మతతత్వ వైఖరితో ఉన్న పార్టీ వైసీపీ అని అన్నారు. జగన్ తో ఎప్పుడు బిజెపి ఉందో చెప్పాలని అన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారని చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడల్లా ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గుర్తుకు వస్తాయన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలను బిజెపి మొదటి నుండి వ్యతిరేకిస్తుందన్నారు సోము వీర్రాజు. ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తాము మొదటి నుండి పోరాటాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తరచూ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ , కేంద్ర పెద్దలతో సమావేశాలు అవుతూ నిధులు తెచ్చుకుంటున్నారని.. అలా బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని ఏపీ ప్రజానీకంలో జగన్ క్రియేట్ చేశారని అన్నారు.