మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిండు గర్భంతో త్వరలోనే ప్రసవానికి సిద్ధమవుతున్నారు. ఇక త్వరలోనే కొణిదెల వారి ఇంట వారసుడో లేక వారసురాలో రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భిణీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. వివాహం జరిగిన పది సంవత్సరాల తర్వాత గర్భం దాల్చిన ఈమె ఎవరికి జన్మనివ్వబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఉపాసన గర్భం దాల్చిన తర్వాత మరింతగా పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో ఈమె ఫోటోలే వైరల్ అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం సంతోషమైన జీవితాన్ని గడుపుతోందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా తన ప్రేగ్నేన్సిపై పలు కామెంట్లు చేస్తూనే మొదటిసారి తన భర్త రియాక్షన్ గురించి వెల్లడించింది. ఉపాసన మాట్లాడుతూ.. చరణ్‌తో నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనిపిస్తోంది అంటూ చెప్పినప్పుడు చరణ్ వెంటనే దీని గురించి ఎక్కువగా ఎక్సయిట్ అవ్వద్దు.. ప్రశాంతంగా ఉండు అన్ని పరీక్షలు చేయించిన తర్వాతే నిర్ధారించుకుందాము అని చెప్పాడు. అందుకే నాకు చరణ్ అంటే చాలా ఇష్టం ఆరాధన అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
నేను ప్రతి విషయాన్ని కూడా వెంటనే చెప్పేస్తాను.. కానీ చరణ్ అలా కాదు.. ప్రతి విషయాన్ని కూడా చాలా కూల్ గా తీసుకుంటాడు. అందుకే రామ్ చరణ్ వల్ల నేను నా లైఫ్ లో చాలా ప్రశాంతంగా.. ఎప్పుడు ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను అంటూ తెలిపింది. మొత్తానికైతే తన భర్త గురించి ఈమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.