సిద్దిపేట మోడల్ ను.. స్ఫూర్తిగా తీసుకుని.. అందరం పని చేస్తాం – మంత్రి కేటీఆర్

-

 

సిద్దిపేట మోడల్ ను స్ఫూర్తిగా తీసుకొని అందరం కలిసి పని చేస్తామని ఈ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిద్దిపేటలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ ఐటీ టవర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభించనుంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు.. మన తెలంగాణలో 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నారు. యువత ఎక్కువగా ఉంది.. వారికి ప్రైవేట్‌ ఉద్యోగం సృష్టించడం కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌.

 

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంది.. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు.. ఈ 9 ఏళ్లలో ఐటీ ఎగుమతులు రెండు లక్షల 41 వేల కోట్లు అన్నారు మంత్రి కేటీఆర్‌. స్వచ్ఛ బడి సిద్దిపేట స్ఫూర్తితో ప్రతి జిల్లాలో స్వచ్ఛ బడి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గం సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకుని మేమందరం పని చేస్తామని… ఐటీ హబ్ ని ఇంకా విస్తరిస్తామని వెల్లడించారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news