కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు

-

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కాసేపట్లో హైదరాబాద్ నుంచి కిషన్‌ రెడ్డి దిల్లీ బయలుదేరనున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ నుంచి ఈటల, కోమటిరెడ్డికి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిల్లీలోనే ఉన్నారు. ఈటల ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పార్టీ హైకమాండ్ భేటీలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు.

బీజేపీలో అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నేతల మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధిష్టానం… అసంతృప్తి చల్లార్చే అంశంపై దృష్టి పెట్టింది. ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డితో చర్చించనున్నారు. పార్టీలో అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దిన తర్వాతే తెలంగాణలో  పర్యటించాలని అగ్రనేతలు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news