BREAKING : తిరుమల భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. తిరుమల నడక దారిలో మరో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతను 24 గంటల్లోనే అటవీ అధికారులు బంధించారు. అయితే పట్టుబడ్డ చిరుత ఏడాదిన్నర వయసున్న పిల్ల చిరుతగా గుర్తించారు.
ఈ క్రమంలోని తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు చెప్పారు. త్వరలో దాన్ని కూడా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని వెల్లడించారు. అటు తిరుమల నడకమార్గంలో ఇనుప కంచే ఏర్పాటు చేయడానికి అటవిశాఖ అనుమతించదని TTD ఇఓ దర్మారెడ్డి ప్రకటన చేశారు. తిరుమలలో ఆపరేషన్ చిరుత సక్సేస్ అయ్యిందని చెప్పారు ఇఓ దర్మారెడ్డి. బాలుడి పై చిరుత దాడికి పాల్పడిన ఘటనను సిరియస్ గా తీసుకున్నామని.. మరో చిరుత కూడా సంచరిస్తూన్నట్లు సమాచారం అందిందని చెప్పారు.