రాజకీయాల నుండి తప్పుకుంటా – కడియం శ్రీహరి హాట్ కామెంట్స్

-

స్టేషన్ ఘన్పూర్ లో అనుకోని విదంగా ఏదైనా మార్పు జరిగి తనకి అవకాశం వస్తే మీరు నాకు సహకరించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. నేడు హనుమకొండ జిల్లా వేలేర్ మండల కేంద్రంలో రెడ్డి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సందర్భంగా ఏర్పటు చేసిన సమావేశం లో హాట్ కామెంట్స్ చేశారు కడియం. గతంలో తనకు స్టేషన్ ఘనపూర్ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారని.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదన్నారు.

మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగరవేసుకొని మా ఎమ్మెల్యే కడియం అని చెప్పే విధంగా పని చేశానన్నారు. ఏ తప్ప చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, తలవంపులు తీసుకురాలేదన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఏ పార్టీ నాయకుడు అయిన నన్ను లంగా, దొంగ అని అంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. రాబోయే రోజుల్లో నిజాయితీగా పనిచేస్తా.. మీకు చెడ్డ పేరు తీసుకురానన్నారు. మీరందరూ గొప్పగా చెప్పుకునే విధంగా నా ప్రవర్తన ఉంటుందని.. చిల్లర పనులు నా దగ్గర ఉండవన్నారు. అందరం కలిసి ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news