తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఎప్పుడో మర్చిపోయారు : బండి

-

కేసీఆర్ సర్కార్ తెలంగాణలోని ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయలకు పైగా అప్పు చేసి దోచుకుంటే… కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించి అప్పులు చేస్తూ ప్రజలను బిచ్చగాళ్లను చేస్తోంది. తెలంగాణలో ప్రజలు కేసీఆర్ ను ప్రజలెప్పుడో మర్చిపోయారు అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అందుకే ఫాంహౌజ్ కే పరిమితమైండు. ఎన్నికలప్పుడే బయటకొచ్చే కేసీఆర్ లాంటి నాయకుడిని తెలంగాణ సమాజం లీడర్ గా భావించదు. వరదలొస్తే బయటకు రాలే. రైతులు అరిగోస పడుతుంటే రాలే. నిరుద్యోగులు రోడ్డున పడితే రాలే.. 6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేస్తే రాలే.

కానీ కేటీఆర్ బామ్మర్థి రేవ్ పార్టీలో దొరికితే మాత్రం డీజీపీకి ఫోన్ చేస్తాడు… తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఇక ఎన్నడూ నమ్మదు. కేసీఆర్ పాలనను తలుచుకుంటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయ్. కాంగ్రెస్ కూడా అంతకుమించి దారుణమైన పాలన చేస్తోంది. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్లయింది. ఈసారి అందుకే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓటేసి గెలిపించేందుకు సిద్ధమయ్యారు అని బండి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news