TSPSC పేపర్ లీక్ కేసు.. తల్లిదండ్రుల మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 78 మందిని అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు నిందితుల తల్లిదండ్రుల మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది.

ప్రశ్నపత్రాల కోసం డబ్బు చెల్లించిన అనేక మంది, ఆ డబ్బు తమ తల్లిదండ్రుల నుంచే తెచ్చుకున్నారు. అంటే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు గురించి చాలామంది తల్లిదండ్రులకు ముందే తెలిసి ఉంటుంది. నేరం గురించి తెలిసీ చెప్పకపోవడం తప్పు కాబట్టి వారిని కూడా ఈ కేసులో జోడించే అవకాశం ఉంది. అయితే వీరిని సాక్షులుగానే పరిగణించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి సిట్‌ అధికారులు న్యాయపరమైన కసరత్తు చేస్తున్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం 18 మందిని, మంగళవారం ముగ్గురిని అరెస్టుచేశారు. దాంతో ఇప్పటి వరకూ అరెస్టయిన వారి సంఖ్య 78కి చేరింది. కనీసం 150 మంది వరకూ అరెస్టవుతారని భావిస్తున్నారు. చాలామంది అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news