దంతాలు పసుపు రంగులోకి మారడానికి.. ముఖ్య కారణాలివే..!

-

చాలామంది దంతాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పళ్ళు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. దీని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. నిజానికి పళ్ళు పసుపు రంగులోకి మారితే చూడడానికి అందంగా ఉండదు సరి కదా పంటి ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. పసుపు రంగులో ఉన్న పళ్ళు తెల్లగా మార్చుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ అసలు ఎందుకు తెల్లగా ఉండే పళ్ళు పసుపు రంగులోకి వచ్చేస్తాయి.. దానికి కారణం ఏంటి అనేది చూద్దాం.

 

వయసు పెరిగే కొద్ది దంతాలు పసుపు రంగులోకి వచ్చేస్తాయి. పెరుగుతున్న వయసుతో అనామిల్ బయట పొర అరిగిపోతుంది. సన్నగా మారిపోతుంది దీని వలన పళ్ళు పసుపు రంగులోకి వచ్చేస్తూ ఉంటాయి కొన్ని రకాల మందుల్ని ఉపయోగించడం వలన కూడా పళ్ళు పసుపు రంగులోకి వచ్చేస్తాయి. గర్భిణీలు అటువంటి మందులను వేసుకుంటే పొట్టబోయే పిల్లల పళ్ళు పసుపు రంగులో ఉంటాయి. నీటిలో ఫ్లోరైడ్ స్థాయిలో ఎక్కువ ఉంటే కూడా పళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి.

చాలామంది బ్రష్ చేసేటప్పుడు టూత్ పేస్ట్ ని తినేస్తూ ఉంటారు దాని వలన కూడా పసుపు రంగులో పళ్ళు వచ్చేస్తాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా అందుకే కారణమే. చెర్రీస్ వంటివి తీసుకుంటే దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. తెల్లగా ఉన్న పళ్ళు పసుపు రంగులోకి వచ్చేస్తాయి అంతేకాకుండా బంగాళదుంపని ఎక్కువగా తీసుకుంటే కూడా పసుపు రంగులోకి పళ్ళు వచ్చేస్తాయి. కూల్డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, నోటి పరిశుభ్రతను పాటించకపోవడం కొన్ని రకాల వ్యాధులు వలన కూడా పళ్ళు పసుపు రంగులోకి మారుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news