ఈ రోజు డొమినికా వేదికగా ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన మొదటి టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ మొదటగా ఫిల్డింగ్ ఎంచుకుంది. ఇండియా ఇద్దరి కొత్త ఆటగాళ్లను ఈ టెస్ట్ లో చోటిచ్చింది, ఐపీఎల్ లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ మరియు ఇషాన్ కిసాన్ లను తీసుకుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇండియాకు స్పిన్నర్ అశ్విన్ మొదటి వికెట్ ను అందించాడు. చందర్ పాల్ ను 12 పరుగుల స్కోర్ వద్ద ఉండగా, బౌల్డ్ చేశాడు. కాగా వెస్ట్ ఇండీస్ జట్టులో ఒక ప్లేయర్ హైలైట్ గా మారుతున్నాడు. రాకీమ్ కార్నివాల్ ను చూస్తే విండీస్ బాహుబలిలా ఉంటాడు, భారీ ఆకారంతో ప్రత్యర్థిని భయపెట్టేలా షాట్ లు ఆడుతూ బౌలర్ల భరతం పడుతుంటాడు. కాగా ఇతను దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్టులోకి కార్నివాల్ రావడం విశేషం.
ఇతను ఎటువంటి బౌలర్ ను అయినా అలవోకగా సిక్సర్ కొట్టగల సమర్ధుడు మరియు ఆఫ్ స్పిన్నర్ ఏ మేరకు రాణించి తన జట్టుకు పలు అవుతాడో చూడాలి.