జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాట తీస్తామని హెచ్చరించారు ఏపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వాక్యాలు చేశారు. ‘బండిమీద కూర్చొని ఊర పందిలాగా మాట్లాడటం కాదు. సీఎం జగన్ ను ఏకవచనంతో సంబోధిస్తే తాట తీస్తాం. ఇంత మంచి చేసే సీఎంను ఏక వచనంతో మాట్లాడతావా? రాత్రిపూట చంద్రబాబుతో కాపురం చేస్తాడు. పగటిపూట బిజెపితో కాపురం చేస్తాడు.
ఇలాంటి వెధవలను బ్యాన్ చేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా’ అంటూ మండిపడ్డారు. పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయాడని చురకలు అంటించారు. పవన్ ఏకపత్నీవ్రతుడు.. ఏక కాలంలో ఒక పత్నీనే ఉంటుంది.. ఇది బాగుందా? అంటూ చురకలు అంటించారు వెల్లంపల్లి. మర్యాదలకు మారుపేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో పవన్ చాలా మర్యాదగా మాట్లాడారు.. మళ్లీ ఎప్పుడు వస్తారు ? అన్నారు. దేవుడు దగ్గర పెట్టిన దీపంతో సిగరెట్ ముట్టించుకున్న కానిస్టేబుల్ కొడుకు హిందూ ధర్మ రక్షణకు వచ్చాడట అంటూ ఫైర్ అయ్యారు.