కేసీఆర్ సర్కార్ పై తమిళి సై హాట్ కామెంట్స్..నన్ను బోనాలకు పిలువలేదు !

-

కేసీఆర్ సర్కార్ పై తమిళి సై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నన్ను బోనాలకు పిలువలేదని ఆగ్రహించారు. రాజ్ భవన్ లో బోనాల వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్వయంగా బోనం ఎత్తుకున్నారు గవర్నర్ తమిళ్ సై. రాజ్ భవన్ లోపల నుంచి బయట వరకు ఊరేగింపు గా బోనాన్ని తీసుకొచ్చారు గవర్నర్, మహిళా సిబ్బంది.

అనంతరం తమిళి సై మాట్లాడుతూ.. బోనాల కోసం నాకు ఎక్కడ నుంచి అధికారిక ఇన్విటేషన్ రాలేదని.. రాజ్ భవన్ మహిళలు మాత్రం నన్ను బోనాలకు ఆహ్వానించారన్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేదని మండిపడ్డారు. అందరికి బోనాల శుభాకాంక్షలు… అందరూ ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణలో బోనాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని.. రాజ్ భవన్ లో బోనాల వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తమిళి సై.

Read more RELATED
Recommended to you

Latest news