ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపైన నిప్పులు చెరిగాడు. ఈయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ముఖ్యమైన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రాన్ని కకావికలు చేస్తున్నాడు, రాష్ట్రము తెలంగాణ నుండి విడిపోయిన అనంతరం మనకు రావాల్సిన కొన్ని బెనిఫిట్స్ విషయంలో కేంద్రాన్ని కానీ లేదా తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ప్రశ్నించకుండా కాలాన్ని వెళ్లదీస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయడంలో జగన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అన్నారు చంద్రబాబు. తెలంగాణ మనకు పదేళ్ల పాటు ఉన్న రాష్ట్ర పరిమితి కూడా మరికొన్ని నెలల్లో పూర్తి కానుంది.
అయినప్పటికీ జగన్ లో ఏమంత చలనం లేకపోవడం ఆయనకు రాష్ట్రంపై ఉన్న అబాధ్యతను గుర్తు చేస్తోంది అన్నారు చంద్రబాబు. ఓట్ల కోసం ఎన్నో హామీలను ఇచ్చిన జగన్ వాటిని పూర్తి చేయలేక ఫెయిల్యూర్ సీఎంగా పేరు తెచుకున్నదంటూ కఠినంగా మాట్లాడారు