పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మొదటిసారి నటిస్తున్న చిత్రం బ్రో. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకి రీమేక్ గా వస్తోంది. ఇక తమిళ్ లో చేసిన సముద్రఖని ఈ సినిమాను రీమేక్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్నారు.
అయితే.. తమిళంలో వచ్చిన ‘వినోదయ సిత్తం’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ‘బ్రో’ సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ సముద్రఖని కీలక వాక్యాలు చేశారు. ఈ సినిమాని మొత్తం 12 భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు వెల్లడించారు. త్వరలో బాలీవుడ్ లో తీస్తామన్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ తో మరో మూవీని చేయబోతున్నట్టు తెలిపారు. ఇది డిఫరెంట్ కథాంశంతో ఉంటుందని చెప్పారు. పవన్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమా 28న రిలీజ్ కానుంది.