కల్లు గీత చెట్లు నరికితే మూడేళ్ల జైలు శిక్ష

-

కల్లు గీత చెట్లు నరికితే మూడేళ్ల జైలు శిక్ష వేస్తామని…మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. వచ్చే నెల 31 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి తాటి, ఈత, ఖర్జూర, గిరక చెట్లకు నంబర్లు ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కల్లుగీత చెట్లు నరికితే మూడేళ్ల జైలు శిక్ష, ఫైన్ లను విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమీక్షలో మాట్లాడుతూ ‘చెట్టు ఎక్కేందుకు ఆధునిక సేఫ్టీ యంత్రాలను కార్మికులకు అందించాలి. కొత్త కల్లు షాపులను మంజూరు చేసి, వారికి లైసెన్సులు మంజూరు చేయాలి’ అని తెలిపారు. ఇది ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగనున్నాయి. TSలోని మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఏపీలోని మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయంది.

Read more RELATED
Recommended to you

Latest news