భాగ్యలక్ష్మి అమ్మవారికి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన.. చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబర్‌పేట చేరుకుని పూలే విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

కిషన్‌రెడ్డి వెంట ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు. కిషన్‌రెడ్డి ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున రాష్ట్ర ఇంఛార్జ్ లను మార్చాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చింది. ఇంతకుముందు ఉన్న బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. అయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండగా.. అధ్యక్షుడిని మార్చడం సరైన నిర్ణయం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news