మణిపూర్‌ ఘటనపై పార్లమెంటులో చర్చించాలి.. బీఆర్‌ఎస్‌ ఎంపీల వాయిదా తీర్మానం

-

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక పరిస్థితులు, ఇటీవల జరిగిన అమానవీయ ఘటనపై పార్లమెంటులో.. బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. మణిపూర్‌లో గిరిజన మహిళలపై అనాగరిక చర్యలు, ఆ రాష్ట్రంలోని పరిస్థితులపై ఉభయ సభల్లో చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఈ ఘటనపై మౌనం వహించడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో నామ నాగేశ్వరరావు, రాజ్యసభలో కేకే వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు.

మరోవైపు.. రాజ్యసభ అన్ని కార్యక్రమాలను వాయిదా వేసి 267 నిబంధన కింద మణిపూర్‌ అంశంపై చర్చ చేపట్టాలని ఎంపీ కేకే డిమాండ్‌ చేశారు. మణిపుర్‌లో శాంతి నెలకొనడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షించారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మణిపుర్‌లో శాంతి నెలకొనాలని.. సాధారణ పరిస్థితులు ఏర్పడాలని బీఆర్ఎస్‌ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

గత కొన్ని నెలలుగా మణిపుర్ లో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఈ ఘటనపై పార్లమెంటులో చర్చించాలని పట్టుబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news