ఎమర్జింగ్ ఆసియా కప్ 2023: లంకను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాకిస్తాన్ !

-

ఈ రోజు కాసేపటిక్రితమే ముగిసిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండు విభాగాలలో రాణించి శ్రీలంకను మట్టి కరిపించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుని ప్రత్యర్థి ముందు 323 పరుగుల టార్గెట్ ను ఉంచింది. అనంతరం భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక కు గెలిచి అవకాశాలు ఉన్నప్పటికీ, కీలక సమయంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను చేజార్చుకుంది. ఓపెనర్ ఫెర్నాండో అద్భుతంగా ఆడి 97 పరుగులతో జట్టును రేస్ లో నిలిపాడు… ఆ తర్వాత ఆరాచిగే చివరి వరకు నిలబడి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ మిగిలిన ఆటగాళ్ల నుండి సరైన సహకారం అందకపోవడంతో శ్రీలంక పరుగుల తేడాతో ఓటమి పాలయింది. శ్రీలంక ను దెబ్బ తీసిన బౌలర్లలో ఇక్బల్ ప్రధమంగా ఉన్నాడు.

ఇతను కేవలం 7 .4 ఓవర్ లు మాత్రమే వేసి 5 కీలక వికెట్లు తీసుకున్నాడు. అలా పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుంది.. ప్రస్తుతం జరుగుతున్న రెండవ సెమీఫైనల్ లో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్ ను ఆడనుంది,

Read more RELATED
Recommended to you

Latest news