రష్యాపై తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ ను పుతిన్ అంత ఈజీగా వదిలిపెట్టడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ప్రిగోజిన్ పై పుతిన్ పగ ఇంకా చల్లారలేదని తాజాగా తెలుస్తోంది. ప్రిగోజిన్ అంతు చూసేందుకు పుతిన్ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికా నిఘా సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ చెప్పారు. వాగ్నర్ తిరుగుబాటు కారణంగా పుతిన్ నిర్మించిన బలహీనతలు బహిర్గతమయ్యాయని ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడుతూ బర్న్స్ ఈ విషయాలు తెలిపారు.
ప్రిగోజిన్.. బెలారస్, రష్యా మధ్య తిరుగుతూనే ఉన్నాడని సీఐఏ బాస్ తెలిపారు. ఇటీవల అతడు బెలారస్ రాజధాని మిస్క్‌లో కనిపించాడని.. మరోవైపు ప్రిగోజిన్‌తో ఎలా డీల్ చేయాలనే విషయంపై కసరత్తు పుతిన్ కాస్త సమయం తీసుకొంటున్నారని చెప్పారు. వాగ్నర్ సైన్యాన్ని ప్రిగోజిన్ నుంచి దూరం చేయాలని పుతిన్ భావిస్తున్నారని వెల్లడించారు. పుతిన్ దృష్టిలో ప్రతీకారం అనేది తాపీగా తీర్చుకొనే అంశంగా ఉంటుందని బర్న్స్ చెప్పుకొచ్చారు. రివేంజ్ తీర్చుకోవడంలో పుతిన్ మించిన వారు లేరని.. ఒక వేళ ప్రిగోజిన్ దీని నుంచి తప్పించుకొంటే తాను ఆశ్చర్యపోతానని సీఐఏ బాస్ అన్నారు.