తెలంగాణ రాష్ట్రం.. ఇండియాలో సక్సెస్‌ఫుల్‌ స్టార్టప్‌ : మంత్రి కేటీఆర్‌

-

యంగ్ రాష్ట్రమైనా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియాలో సక్సెస్‌ఫుల్‌ స్టార్టప్‌ తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ నేడు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని వెల్లడించారు. హైదరాబాద్ లో  ‘ఛాలెంజెస్ ఆఫ్ బీయింగ్ ఏ యంగ్ స్ట్రీట్‘ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు.

‘‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో మొదలైన ఉద్యమంలో ప్రతి ఒక్కరు రాష్ట్ర సాధన కోసం పోరాడారు.  తెలంగాణ వస్తే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుందని మాట్లాడారు. కరెంట్, నీటి విషయంలో ఇవాళ తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించుకున్నాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తుందో.. భారత్‌ అనుసరిస్తోంది.‘‘ అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news