ఘోరం.. ఉప్పల్ లో యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

-

తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతి గొంతు కోశాడు ప్రేమోన్మాది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతోంది. అయితే ఆ వ్యక్తి వివాహితుడు అని పోలీసుల దర్యాప్తులో తేలడం గమనార్హం.

హబ్సిగూడకు లక్ష్మీనారాయణకు గతంలోనే వివాహం అయింది. రామంతాపూర్‌లో నివాసం ఉంటున్న బంధువైన యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఆమె కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అతణ్ని మందలించారు. కోపం పెంచుకున్న నారాయణ.. ఓసారి మాట్లాడదామని యువతిని కలిశాడు. రెండ్రోజుల క్రితం లక్ష్మీనారాయణ యువతిని కారులో ఎక్కించుకొని ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లే అవుట్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా.. క్షణికావేశంలో నారాయణ బ్లేడుతో యువతి గొంతు కోసి పరారయ్యాడు. స్థానికుల సాయంతో ఆస్పత్రికి చేరుకున్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news