BREAKING : సీఎం జగన్ అమలాపురం పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 28న జరగాల్సిన అమలాపురం పర్యటన వాయిదా పడింది. వర్షాల ఫోర్ క్యాస్ట్ నేపథ్యంలో సీఎం జగన్ అమలాపురం పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ పర్యటన ఈ నెల 31న ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
ఇది ఇలా ఉండగా, ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఇప్పటివరకు 1.8 కోట్లమైంది వైద్య సేవలు పొందారని మంత్రి విడదల రజిని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ గ్రామానికి వచ్చే ముందురోజే ఊరిలో చాటింపు వేయించాలని అధికారులకు సూచించారు. ఏపీ వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి NSD సర్వే చేపడతామని మంత్రి తెలిపారు. దీనివల్ల కొత్త కేసులు ఏమైనా బయటపడితే చర్యలు తీసుకోవడానికిఅవకాశం కుదురుతుందని వెల్లడించారు.