తెలంగాణకు మరో 3 రోజులు భారీ వర్షాలు..రాత్రి నుంచే కుండపోత

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ రాష్ట్రానికి మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచే కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి గ్యాప్‌ లేకుండా దంచికొడుతోంది వర్షం. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇక తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.. కొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రెడ్‌ అలర్ట్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అత్యవసరమైతేనే ఇండ్లలో నుండి బయటకు రావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news