కిన్నెసాని బ్రిడ్జి నుంచి నిలిపివేసిన రాకపోకలు

-

 

తెలంగాణ రాష్ట్రంలో దంచికొడుతున్నాయి వర్షాలు. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. అటు చాలా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. ఇక నిన్న ఒక్క రోజే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో అత్యధికంగా 61.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. గత మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది.

ప్రాజెక్ట్ నుంచి 12 గేట్లను వదిలిపెట్టి దిగువకి గోదావరిలో నీటిని విడుదల చేస్తున్నారు. వరంగల్ జిల్లా భద్రాద్రి, ములుగు మంచి కురిసిన వర్షాలతో కిన్నెరసానికి భారీ ఎత్తున వరద వచ్చి చేరింది. ఒక లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు కిన్నెరసానీ నుంచి గేట్ల ద్వారా గోదావరిలో వదిలివేస్తున్నారు. దీంతో పినపాక పట్టి వద్ద ప్రధానమైన బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు రాకపోకలు నిలిపివేయడంతో పాల్వంచ వరకు సుమారు పది కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి మరోవైపున గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news