నీ అవ్వ తగ్గేదేలే.. అల్లు అర్జున్​కే ‘నో’ చెప్పిన శ్రీలీల

-

టాలీవుడ్​లో ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ శ్రీలీల. ఈ భామ చేతినిండా సినిమాలతో సూపర్ బిజీగా గడుపుతోంది. గ్యాప్ లేకుండా షూటింగ్స్​లో పాల్గొంటోంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మొదలుకుని.. మహేశ్ బాబు, బాలకృష్ణ, రామ్, నితిన్ వంటి యంగ్ హీరోలతోనూ నటిస్తోంది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్​.. తమ హీరోతో శ్రీలీ ఎప్పుడు నటిస్తుందని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇటీవల వీరిద్దరి కాంబోలో ఓ యాడ్ కూడా వచ్చింది. ఆ యాడ్​లో వాళ్ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని నెటిజన్లు భావించారు.

అయితే తాజాగా శ్రీలీల వద్దకు అల్లు అర్జున్​ సినిమాకు సంబంధంచి ఓ ఆఫర్ వచ్చిందట. కానీ ఈ బ్యూటీ ఆ ఆఫర్​ను తిరస్కరించిద. ఇంతకీ అలా ఎందుకు చేసిందంటే..? ప్రస్తుతం బన్నీ పుష్ప-2 షూటింగులో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలోనూ ఓ ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆ సాంగ్​లో నటించమని శ్రీలీలను అడిగారట. అయితే దీనికి ఈ భామ నో చెప్పిందట. సోలో హీరోయిన్​గా ఫుల్ బిజీగా ఉంటున్న ఈ భామ.. స్పెషల్​ సాంగ్స్​ చేయాలనుకోవడం లేదట.

Read more RELATED
Recommended to you

Latest news