టాలీవుడ్ హీరోయిన్స్ విద్యార్హత ఏంటో తెలుసా..?

-

వెండితెరపై గ్లామర్ గా అభిమానులను అలరించే హీరోయిన్లలో కూడా మంచి ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉందన్న విషయం బహుశా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలి అంటే స్టార్ హీరోలతో పోల్చుకుంటే స్టార్ హీరోయిన్ల విద్యార్హత కొంచెం ఎక్కువగానే ఉందన్న వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే టాలీవుడ్ లో రాణిస్తున్న ఈ హీరోయిన్ల విద్యార్థుల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

సమంత రుత్ ప్రభ:
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత మొన్నటి వరకు వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా గడిపింది. అయితే ఇప్పుడు తాను మయోసిటీస్ అనే వ్యాధిబారిన పడడం కారణంగా చికిత్స నిమిత్తం కొద్ది రోజులు సినిమా షూటింగ్లకు బ్రేక్ చెబుతున్నట్లు ప్రకటించింది. ఇక ఈమె విద్యార్హత విషయానికి వస్తే.. చెన్నైలోని స్టెల్లా మెరిస్ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసి.. గ్రాడ్యుయేట్ పూర్తి అయ్యేసరికి మోడలింగ్ లో పాల్గొనింది. ఆ తర్వాత 2010 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

కీర్తి సురేష్:
2000 సంవత్సరంలో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కీర్తి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి.. 2013లో గీతాంజలి అనే మలయాళ చిత్రం ద్వారా సినీ కెరియర్ ను మొదలుపెట్టింది.

పూజా హెగ్డే:
ముంబైలో మానెక్ జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్టులో స్కూలింగ్ పూర్తి చేసిన ఈమె ఎంఎంకె డిగ్రీ కాలేజ్ నుండి ఎం కామ్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థలో తన తల్లికి సహాయంగా నిలిచి 2009లో మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొనింది. ఆ తర్వాత ముగమూడి అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టింది.

రష్మిక మందన్న:
బెంగళూరులోని M.S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీలో సైకాలజీ , జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేసి మోడలింగ్ లో అడుగుపెట్టిన ఈమె కిర్రిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా కెరియర్ మొదలు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news