బిజేపి అనేది కేంద్రంలో తిరుగులేని పార్టీ అందులో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ పూర్తి బలంతో అధికారంలో ఉంది. ఇక కేంద్రంలో అధికారం ఉన్నామని తమకు బలం లేని రాష్ట్రాల్లో వేరే పార్టీలని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనేది బిజేపి ప్లాన్. అలా కొన్ని రాష్ట్రాల్లో ట్రై చేసి సక్సెస్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఆ మధ్య తెలంగాణలో కాస్త హడావిడి చేసింది గాని..అక్కడ బిజేపికి అధికారం వచ్చే ఛాన్స్ లేదు.
ఇక ఏపీలో బిజేపి బలం సున్నా..అంటే ఒక శాతం కంటే తక్కువ ఓట్లే బిజేపికి ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉంటూ ఏపీకి బిజేపి చేసిందేమి లేదు. అయితే ఏపీలో మాత్రం పోలిటికల్ గేమ్ బాగానే ఆడుతుంది. ఎలాగో అధికార వైసీపీని తమ గ్రిప్ లోనే ఊచుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇటు టిడిపిని సైతం నోరు మెదపనివ్వడం లేదు. అటు ఎలాగో పవన్..బిజేపితో కలిసే ఉన్నారు. అయితే ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చిన తమ మాట వినాలనేది బిజేపి ప్లాన్.
ఇక రానున్న ఎన్నికల్లో బిజేపి-జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. రెండు పార్టీలు పోటీ చేస్తే 10 సీట్లు కూడా రావడం కష్టమే. బిజేపికి ఎక్కడ డిపాజిట్ రాదు. బిజేపి వల్ల జనసేనకు పావలా ఉపయోగం లేదు. అయితే టిడిపిని కలుపుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ బిజేపిపై ఉన్న వ్యతిరేకత టిడిపిపై పడుతుంది. అప్పుడు నష్టమే.అంటే బిజేపితో కలిసి వెళ్ళడం వల్ల అటు పవన్‌కు యూజ్ లేదు..ఇటు బాబుకు డ్యామేజ్ తప్పదు.
ఒకవేళ బిజేపి-జనసేన కలిసి, టిడిపి ఒంటరిగా వెళ్ళిన నష్టం తప్పదు. టిడిపి ఒంటరిగా వైసీపీపై పోరాడలేదు. దీని వల్ల వైసీపీకే లాభం. కాబట్టి బిజేపితో ఎటు చూసుకున్న పవన్, బాబులకు డ్యామేజ్ తప్పదు.