బుర్రిపాలెం బుల్లోడికి అరుదైన ఘనత.. కుటుంబ సభ్యుల సమక్షంలో..!

-

బుర్రిపాలెం బుల్లోడు అనగానే వెంటనే గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ.. ఆయన మన మధ్య లేకపోయినా సరే ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు అరుదైన ఘనతను అందించడానికి సిద్ధమయ్యారు బుల్లి పాలెం ప్రజలు. వచ్చేనెల అంటే ఆగస్టు 5వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన ఊరు బుర్రిపాలెం లో కృష్ణ గారి అభిమానులు కుటుంబ సభ్యులు ఆయన గుర్తుగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం. దానికి కృష్ణ కుటుంబ సభ్యులు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు కృష్ణ గారితో పనిచేసిన వ్యక్తులు కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయబోతున్నారని సమాచారం.

మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును అభిమానులు ఎంత ఘనంగా నిర్వహించేవారు. ముఖ్యంగా కృష్ణ గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మరి అభినందనలు తెలిపి ఆయనను ఆనందింప చేసేవారు ఒక్కోసారి ఒక్కో ఊర్లో ఉండేవారు కృష్ణ. అక్కడికే బస్సులో అభిమానులు వెళ్లి ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసేవారు. అయితే గత సంవత్సరం సెప్టెంబర్ 15న ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఈ బాధను మర్చిపోలేక అభిమానులు ఎన్నో రోజులు ఆయన స్మరణలోనే ఉన్నారని చెప్పాలి.

ఇదిలా ఉండగా కృష్ణ గారి సొంతూరు గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం.. అక్కడే 1943 మే 31న జన్మించారు. సినిమాలలో యాక్టివ్ గా ఉన్నప్పుడు తన సొంత ఊరికి వెళుతూ ఉండేవారు. అలాగే అక్కడ కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా అవుతూ ఉండేది. ఇకపోతే కృష్ణ గారి మరణాంతరం ఆయనను స్మరించుకుంటున్న ఆ ఊరి ప్రజలు ఆగస్టు 5వ ఉదయం 10:30 గంటలకు కృష్ణగారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విగ్రహకావిష్కరణ కృష్ణ గారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news