నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో పాదయాత్ర చేసిన లోకేష్ ప్రస్తుతం ప్రకాశంలో చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా అన్నీ వర్గాల ప్రజలకు దగ్గరవ్వడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఓ వైపు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే..మరోవైపు టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతున్నారు. అయితే మొదట్లో వైసీపీ..లోకేష్ పాదయాత్రని గట్టిగానే టార్గెట్ చేసింది.
తర్వాత పట్టించుకోలేదు. కానీ నిదానంగా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్నారు. కాస్త అది టిడిపికి ప్లస్ అవుతుంది. పైగా ఇప్పుడు టిడిపికి బలమైన జోన్ గుంటూరు, కృష్ణాల్లోకి లోకేష్ పాదయాత్ర వస్తుంది. దీంతో లోకేష్‌ని వైసీపీ టార్గెట్ చేస్తుంది. తాజాగా ఒంగోలులో లోకేష్ జయహో బిసి సభ ఏర్పాటు చేసి..ఈ నాలుగేళ్లలో దాడులకు గురైన బిసి బాధితులతో మాట్లాడారు..అలాగే వైసీపీ బిసిలకు ఏం చేయలేదని, కేసులు పెట్టిందని, దాడులు చేసిందని, టిడిపి అధికారంలోకి వస్తే బిసిలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఈ సభకు యాంకర్‌గా ఉదయభానుని పెట్టారు. బాలయ్యపై ఉన్న అభిమానంతో తాను అక్కడకు వచ్చినట్లు ఉదయభాను చెప్పారు. ఇక ఇలా యాంకర్‌ని పెట్టడంపై వైసీపీ సెటైర్లు వేస్తుంది. యువగళంకు స్పందన కరువై ఎవరూ గాలానికి చిక్కడం లేదని , యాంకర్ గళాన్ని జోడించారని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.
పాపం యువగళంకి ఉదయభాను యాంకరింగ్ కావాల్సి వచ్చిందని అంబటి రాంబాబు అన్నారు. అలాగే మా రాష్ట్రం గురించి మీకేందుకు అంటూ ఉదయభానుపై వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇలా లోకేష్ పాదయాత్రపై వైసీపీ సెటైర్లు వేస్తుంది.