కమలంలోకి కొండా ఫ్యామిలీ..క్లారిటీ ఇదే.!

-

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో నేతలు మంచి అవకాశాలు ఎదురుచూస్తున్నారు. ఒక పార్టీలో అవకాశం దక్కకపోతే మరొక పార్టీలోకి జంప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ లో ఒక సీటుకు ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. దీంతో సీటు దక్కదనుకునే నేతలు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. మొన్నటివరకు బి‌జే‌పి వైపుకు వెళ్లారు. కానీ బి‌జే‌పి రేసులో వెనుకబడింది. దీంతో కాంగ్రెస్ లోకి జంప్ కొడుతున్నారు.

ఇటు కాంగ్రెస్ లో ఛాన్స్ లేదనుకునే వారు బి‌ఆర్‌ఎస్ లోకి వెళుతున్నారు. ఇలా ఎవరికి వారు సీట్ల కోసం అటు, ఇటు జంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో కీలకంగా ఉండే కొండా ఫ్యామిలీ పార్టీ మారుతుందని ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ లో అడిగిన సీట్లు దక్కేలా లేవని, అందుకే వారు బి‌జే‌పిలోకి జంప్ చేస్తారని ప్రచారం వస్తుంది. అయితే మరి ఇది ఎంతవరకు నిజమవుతుందంటే..అసలు ఛాన్స్ పెద్దగా లేదని తెలుస్తుంది.

బలమైన కాంగ్రెస్ పార్టీని వదులుకుని బలహీనమైన బి‌జే‌పిలోకి వెళ్ళడం అనేది జరిగే పని కాదని చెప్పవచ్చు. ఆ విషయం కొండా అనుచరులు తేల్చి చెప్పేస్తున్నారు.  కొండా ఫ్యామిలీ మూడు సీట్లు అడుగుతుందట..కొండా సురేఖ కోసం వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు ఏమో కొండా మురళి, పరకాల సీటులో కొండా కూతురు సుస్మితాకు అడుగుతున్నారట.

అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని తెలుస్తుంది. కొండా సురేఖ వరంగల్ తూర్పు, సుస్మితాకు పరకాల సీటు ఫిక్స్. ఫ్యామిలీకి రెండు సీట్లు దాదాపు ఫిక్స్. ఇక మురళి..మంత్రి ఎర్రబెల్లిపై పోటీ చేస్తానని, పాలకుర్తి సీటు ఇవ్వాలని కోరారు. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదని తెలిసిందే. భూపాలపల్లి అడిగినట్లు కూడా టాక్ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ ఉన్నారు. కాబట్టి కొండా ఫ్యామిలీకి కాంగ్రెస్ లో రెండు సీట్లు ఫిక్స్. వారు మూడు సీట్ల కోసం బి‌జే‌పిలోకి వెళ్ళే ఛాన్స్ లేదు. అసలు వరంగల్ లో డిపాజిట్ కూడా రాని బి‌జే‌పిలోకి వెళ్ళడం జరిగే పని కాదు. కాబట్టి కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ లోనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news