ఓటిటిలో ‘సామజవరగమన’ సరికొత్త రికార్డ్

-

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, యంగ్ హీరోయిన్ రెబా మౌనిక జంటగా నటించిన తాజా చిత్రం సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీవిష్ణు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏడు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్లకు పైగా రాబట్టింది. ఈ చిత్రంలో నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల కీలకపాత్రలలో నటించారు.

థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. ఓటీపీ లో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది సామజవరగమన. ఆహా ఓటీటీలో అత్యంత వేగంగా 40 గంటల్లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసిన చిత్రంగా సామజవరగమన నిలిచింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకం పై నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news