మహారాష్ర్టలో కెసిఆర్‌ క్రియాశీలక అడుగులు-విపక్షాల్లో పెరుగుతున్న కలవరం

-

మహారాష్ర్టలో బిఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణపై దృష్టి సారించారు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు. తొలుత కాంగ్రెస్‌ను ఏకాకిని చేసి మిగతా పార్టీలకు ఏకతాటిపైకి తీసుకురావాలన్న సంకల్పంతో అడుగులు వేసిన చంద్రశేఖర్‌రావు ఆ తరువత కాలం కలిసిరాక నెమ్మదించారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆయన ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో పార్టీకి జాతీయహోదా సాధించడంపై దృష్టి పెట్టారాయన. తన క్రియాశీలతను పెంచుతూ మహారాష్ర్టలో బలాన్ని కూడగట్టుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.

అక్కడ కూడా తెలంగాణ మోడల్ణు అమలు చేస్తామంటూ రైతులను ప్రభావితం చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్‌,శివసేన, ఎన్‌సీపీ మరియు బీజేపీ క్రియాశీలకంగా ఉన్న మహారాష్ర్టలో ఆయన సభ్యత్వ నమోదుపై చేపట్టిన డ్రైవ్‌ ద్వారా పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బ్లాక్‌ స్థాయిలో బిఆర్‌ఎస్‌ కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభిస్తున్నారు.శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటన బట్టి చూస్తే మహారాష్ట్రలో కేసీఆర్ కార్యకలాపాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అంచనా వేయవచ్చు.

ఇటీవల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా బీఆర్‌ఎస్‌కు కొత్త అర్థం చెప్పారు.బీజేపీకి బిఆర్‌ఎస్‌ పార్టీ సాపేక్ష పార్టీగా ఆయన అభివర్ణించారు. అన్ని పార్టీల నుంచి అసంతృప్తులను కూడగట్టుకుని కేసీఆర్ కొత్త వేదిక సృష్టించినందుకే రాజకీయ అశాంతికి కారణమని రాహుల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.బాబాసాహెబ్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ అయిన వంచిత్ బహుజన్ అఘాడి (VBA)ని ఆశ్రయించి ఎన్‌సీపీని విచ్ఛిన్నం చేయడంలో కేసిఆర్‌ హస్తం కూడా ఉందని రాహుల్‌ దుయ్యబట్టారు.

జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన కేసిఆర్‌ ఇతర రాష్ట్రాల్లో తనను బయటి వ్యక్తిగా పరిగణించకూడదన్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. తొలుత లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్, కుమారస్వామిలను కలుపుకుని కాంగ్రెస్, బీజేపీలు లేని ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటుకు కూడా ప్రయత్నించారు. ఇది సక్సెస్‌ కాకపోవడంతో తన పార్టీని విస్తరించే పనిలో బిజీ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ వెలుపల చొచ్చుకుపోయే ప్రయత్నాల్లో తొలిసారిగా మహారాష్ట్రకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి వంశీధర్ రావును కూడా ఇంచార్జిగా నియమించారు. 15 మంది సభ్యుల కమిటీ, ఆరు డివిజన్లలో ఎన్సీపీ నుంచి తీసుకొచ్చిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకే ఎక్కువ బాధ్యతలు అప్పగించారు. చైర్మన్ కేసీఆర్ స్వయంగా ఉంటారు.

ప్రకాష్ అంబేద్కర్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు ఖరారైనట్లే ఇప్పుడు కేసీఆర్ కదులుతున్నట్లు కనిపిస్తున్న బాటలోనే ఫిక్సయినట్లు భావిస్తున్నారు.రెండు నెలల క్రితమే హైదరాబాద్‌లో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా కేసీఆర్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకుని వీబీఏ 238 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. 4.6 శాతం ఓట్లు కూడా వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో వీబీఏకు 6.97 శాతం ఓట్లు వచ్చాయి. ప్రకాష్ స్వయంగా అకోలాలో రెండవ స్థానంలో, అతని పార్టీ 41 స్థానాల్లో మూడవ స్థానంలో నిలిచింది.ఈ సారి విబిఏ పార్టీతో జతకట్టి ఎన్నికలకు వెళ్తోంది. ఎక్కువ మంది తెలంగాణ ప్రజలు మహారాష్ర్టలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా సెటిలై ఉన్నారు.వారిని నేరుగా కలుసుకుని పార్టీ సభ్యత్వాలను వేగవంతం చేయాలని స్టీరింగ్‌ కమిటీకి ఇప్పటికే ఆదేశాలిచ్చారు కెసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news