చిన్నపిల్లల అక్రమ రవాణాలో తొలి మూడు స్థానాల్లో బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ ఉన్నాయి. ‘భారత్ చిన్నారుల అక్రమ రవాణా’ పేరుతో గేమ్స్ 24X7 అనే స్వచ్ఛంద సంస్థ, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్ధి స్థాపించిన కేఎస్సీఎఫ్ సహకారంతో అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తాజా నివేదిక ఆదివారం విడుదల చేసింది.
పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి కేఎస్ సీఎఫ్ తోపాటు దాని అనుబంధ సంస్థల వద్ద 2016 నుంచి 2022వరకు ఉన్న సమాచారాన్ని గేమ్స్ 24×7 సేకరించింది. అందులో 21 రాష్ట్రాల్లో బిహార్ ఆరేళ్ల కాలంలో మొత్తం 4245 కేసులు వెలుగు చూడగా.. యూపీలో 3836 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 734 కేసులకు నమోదు కాగా.. వాటిలో గుంటూరు (208), నెల్లూరు (125), శ్రీకాకుళం (98), కర్నూలు (74), భీమవరం (28)లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.