తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..స్కూళ్లకు ఇవాళ సెలవు లేదు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థలు ఇవాళ పున ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుందని కొంతమంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు భావించినా… విద్యాశాఖ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో నేటి నుంచి యధావిధిగా స్కూల్లో మరియు కాలేజీలు నడవనున్నాయి.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరియు రేపు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక మంగళవారం అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలంతు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నిన్నటి రోజున హైదరాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల తదితర జిల్లాలలో వర్షాలు పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news