హర్యానా రాష్ట్రం రావణకాష్టంలా మారింది. డు వర్గాల మధ్య ఘర్షణతో హరియాణాలోని నూహ్ జిల్లాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మృతి చెందగా.. రాత్రి జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి ప్రాణలు కోల్పోయాడు. ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. దాదాపు 45 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. నూహ్‌జిల్లాకు ఆనుకొని ఉన్న గురుగ్రామ్‌లోనూ ఈ ఘర్షణల ప్రభావం పడింది.
నూహ్ జిల్లాలో పరిస్థితులు మంగళవారం రోజూ ఉద్రిక్తంగానే ఉండటంతో.. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ విధించినట్లు హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అలాగే భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. అలాగే 20 కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. బాధ్యుల్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వివరించారు.
మరోవైపు ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఇది దురదృష్టఘటన అని.. రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని కోరుతున్నట్లు చెప్పారు. బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టమని భరోసా ఇచ్చారు.