స్కంద మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..!

-

రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం స్కంద. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలోని “నీ చుట్టూ చుట్టూ” అంటూ సాగే మొదటి పాట లిరికల్ వీడియోను ఈనెల 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగా పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా మాస్ మసాలా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ రేంజ్ లో విజయం అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక అందుకు తగ్గట్టుగానే మొన్న మధ్య విడుదలైన గ్లింప్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడ. గుబురు గడ్డంతో పల్లెటూరు కుర్రాడిగా కనిపించిన ఈయన సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. అఖండ లాంటి సంచలన విజయం అందుకున్న బోయపాటి.. ఎలాంటి కథతో రానున్నాడు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సెప్టెంబర్ 15వ తేదీన స్కంద సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ స్కంద మూవీ తెలుగు, కన్నడ, తమిళ్ , హిందీ, మలయాళం భాషలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి మొదటి షెడ్యూల్ లో రామ్ తో పాటు ఇతర నటులు కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది..ఇక త్వరలోనే మరో షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక మార్చి 8వ తేదీన డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news