ఎలాన్ మస్క్‌కు షాక్.. శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయంపై X లోగో తొలగింపు

-

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు గట్టి షాక్ తగిలింది. ట్విటర్‌ను ఓ సూపర్‌ యాప్‌గా మార్చే క్రమంలో దాని పేరును ఎక్స్‌ (X)గా మార్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంపై ఎక్స్‌ లోగోను ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో శాన్‌ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం లోగోను తొలగించింది. ఎక్స్‌ లోగో డిస్‌ప్లేలో అమర్చిన ప్రకాశవంతమైన లైట్ల కారణంగా రాత్రుళ్లు ఆ కాంతి నేరుగా తమ ఇళ్లలోకి పడుతుందని అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఎక్స్‌ లోగోపై 24 మంది ఫిర్యాదు చేశారని శాన్‌ఫ్రాన్సిస్కో భవనాల తనిఖీ విభాగం అధికారి పాట్రిక్‌ హన్నన్‌ తెలిపారు.  ఆ లోగోను అనుమతి లేకుండా ఏర్పాటు చేయడమే కాకుండా, దాని నుంచి వెలువడే కాంతి వల్ల రాత్రిళ్లు తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు.  స్థానికుల ఫిర్యాదుతో తమ బృందం లోగో ఏర్పాటును సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్లు నిర్ధారించిందని స్పష్టం చేశారు. దీంతో దాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.

అంతకుముందు ఎక్స్‌ లోగో ఏర్పాటుపై శాన్‌ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం సైతం విచారణకు ఆదేశించింది. ఒక సంస్థ లోగో గుర్తును మార్చాలనుకున్నప్పుడు డిజైన్‌, భద్రత కారణాల దృష్ట్యా ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news