బీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చడంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తరచూ అక్కడ పర్యటిస్తూ.. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి ప్రజలను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మరోసారి మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటించనున్నారు.
ఇందుకోసం హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు సీఎం కేసీఆర్ బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత ముందుగా అంబబాయి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి సాంగ్లి జిల్లాలోని వాటేగావ్ గ్రామంలో.. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రముఖ సంఘ సంస్కర్త దివంగత అన్నాభావూ సాఠే 103వ జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పిస్తారు.
ఇవాళ ఒంటిగంటకు అన్నాభావూ కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ కలుస్తారు. 1:30 గంటలకు ఇస్లాంపూర్‌లోని రఘునాథ్‌దాదా పాటిల్ ఇంట్లో భోజనం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.