BREAKING: విద్వంసకర ప్లేయర్ “అలెక్స్ హేల్స్” షాకింగ్ నిర్ణయం

-

ఇంగ్లాండ్ విద్వంసకర ప్లేయర్ అలెక్స్ హేల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కాసేపటి క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలెక్స్ హేల్స్ 2011వ సంవత్సరంలో ఇండియా తో టీ 20 మ్యాచ్ ద్వారా కెరీర్ ను ఆరంభించాడు. ఈ 12 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించాడు హేల్స్. హేల్స్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 11 టెస్ట్ లు, 70 వన్ డే లు మరియు 75 టీ 20 లలో ఇంగ్లాండ్ తరపున అప్రతనిథ్యం వహించాడు. కేవలం టీ 20 లలో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో ఇంతకాలం నెట్టుకుంటూ వచ్చాడు. ఇంకా గత సంవత్సరం ఇంగ్లాండ్ టీ 20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవడంలో హేల్స్ కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా పై కీలక సమయంలో 86 పరుగులు చేయడం ద్వారా ఫైనల్ కు ఇంగ్లాండ్ వెళ్ళింది.

ఇంకా ప్రపంచ వ్యాప్తంగా హేల్స్ అన్ని టీ 20 టోర్నమెంట్ లలో ఆడుతూ కీలక ఇన్నింగ్స్ లను ఆడాడు. ఈ రోజుతో అంతర్జాతీయంగా రిటైర్మెంట్ ని ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news