వచ్చే ఎన్నికల తర్వాత నేను అసెంబ్లీలో నేను ఉండనంటూ అసెంబ్లీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వాక్యాలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ఎవరు ఉంటారో? ఉండరో? తెలియదు. నేనైతే ఉండకపోవచ్చు. నేను అసెంబ్లీకి రావద్దని… బయట వాళ్ళు, సొంతవాళ్లు కోరుకుంటున్నారు.
నేను ఉన్నా లేకపోయినా మా దూల్ పేట ప్రజలపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలి. అక్కడి ప్రజల కోసం ఏదైనా ఉపాధి కల్పించండి’ అని రాజాసింగ్ కోరారు. తన నియోజక వర్గంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ సహకరించాలని కోరారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కాగా, గత కొన్ని నెలల కిందట… గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ పార్టీ వేటు వేసిన సంగతి తెలిసిందే.