గద్దర్‌ అంతిమయాత్ర ప్రారంభం.. రూట్ మ్యాప్ ఇదే

-

ప్రజాగాయకుడు గద్దర్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియం నుంచి నుంచి గన్‌పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసం వరకు అంతిమయాత్ర జరగనుంది. అల్వాల్‌లో గద్దర్‌ పార్థివదేహాన్ని కొంత సమయం ఉంచుతారు. అనంతరం సమీపంలోని బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

గద్దర్​కు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించి.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంతో ఆయన పాటతో యువత రక్తం మరిగిపోయి.. ఉద్యమ పోరువైపునకు వారిని ఆకర్షితులను చేసిందని ప్రముఖులు అన్నారు. గద్దర్ భౌతిక కాయానికి బీఆర్ఎస్ మంత్రులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పరిటాల శ్రీరామ్, మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news