‘ఖుషి’ సినిమా ట్రైలర్ రిలీజ్​కు డేట్ ఫిక్స్

-

విజయ్ దేవరకొండ- సమంత కలిసి నటిస్తున్న సినిమా ఖుషి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి మూడు పాటలు రిలీజ్ అయి ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఇక సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది ‘ఖుషి’ టీమ్.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. జయరామ్‌, మురళీ శర్మ, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్​ను ప్రకటించింది టీమ్. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు తెలిపింది. భిన్న నేపథ్యాలు కలిగిన ఓ జంట ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. జి.మురళి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news