మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ పిక్నిక్ స్పాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కారు అదుపుతప్పి జలపాతంలో పడిపోయింది. అందులో ఇద్దరు వ్యక్తులు ఉండగా.. అక్కడే ఉన్న సందర్శకులు వారిని కాపాడారు. నీటికి దగ్గరగా కారును పార్క్ చేయడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
సిమ్రోల్ ప్రాంతం పిక్నిక్ స్పాట్ కావడం వల్ల అక్కడికి చాలా మంది సందర్శకులు వచ్చారు. అలాగే ఓ కుటుంబం కూడా వచ్చింది. కారులో వచ్చిన వారు.. కారును జలపాతం సమీపంలో పార్కు చేశారు. అందులో నుంచి మహిళ దిగింది. తండ్రీకూతుళ్లు ఇద్దరూ కారులోనే ఉన్నారు. అయితే డోర్ గట్టిగా వేయడంతో ఒక్క కుదుపుతో కారు నీటిలో పడిపోయింది. ఆ సమయంలో తండ్రీ కూతుళ్లు అందులోనే ఉన్నారు. గమనించిన సందర్శకులు వెంటనే నీటిలోకి దూకి వారిని కాపాడారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఇండోర్ రూరల్ ఎస్పీ సునీల్ మెహతా వెల్లడించారు. కారును నిర్లక్ష్యంగా నీటికి సమీపంలో పార్క్ చేశారని.. ట్రంక్‌ను బలంగా మూసేయడం వల్ల కారు ముందుకు జరిగి నీటిలో పడిపోయిందని చెప్పారు.
Instead of engaging Reverse gear, mistakenly engaged first gear.
Incidence as being reported is from #Simrol MP near #Indore.
Husband, Wife & Child all three have been saved.
Never Park your vehicle on such ridges!!! pic.twitter.com/ZsZwnBUvDq
— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) August 7, 2023