మణిపుర్‌ అంశంపై ప్రధాని మౌనవ్రతం పాటిస్తున్నారు: గౌరవ్‌ గొగొయ్‌

-

అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. చర్చను ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ ప్రారంభించారు. చర్చ ప్రారంభంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ ప్రారంభించకపోవడాన్ని బీజేపీ ఎంపీలు నిలదీశారు. మణిపుర్‌లో హింస అంశంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని.. గౌరవ్‌ గొగొయ్‌ తెలిపారు. హింస ఎక్కడ జరిగినా అది ప్రజాస్వామ్యానికి విఘాతమేనని అన్నారు. మణిపుర్‌ అంశంపై ప్రధాని మౌనవ్రతం పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ప్రధాని మోదీని మూడు అంశాలపై ప్రశ్నిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రధాని మణిపుర్‌ ఎందుకు వెళ్లలేదు? ప్రధాని శాంతికి పిలుపు ఇచ్చి ఉంటే అది చాలా ప్రభావవంతంగా ఉండేది. మణిపుర్‌కు విపక్షాలు వెళ్లాయి, రాహుల్‌ వెళ్లారు, మోదీ ఎందుకు వెళ్లలేదు? మణిపుర్‌ తగలబడుతుంటే.. భారత్‌ తగలబడుతున్నట్లే. ముందు మణిపుర్‌ వెళ్లి చూడండి.. అప్పుడు మాట్లాడండి. మణిపుర్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు విఫలమైంది. మణిపుర్‌ వైరల్‌ వీడియో ఎంత దారుణంగా ఉందో దేశమంతా చూసింది. మణిపుర్‌ మంత్రి సోదరుడు డ్రగ్‌ మాఫియా నడుపుతున్నారు. డ్రగ్‌ మాఫియా నిందితుడిని సీఎం ఫోన్‌కాల్‌తో విడుదల చేశారు.” అని గొగొయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news